పవర్ స్టార్ ఫ్యాన్స్ రియల్ పవర్ ఇదే

0
173

pawan fans power shtgbansపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ ఈ సమ్మర్ లో మోస్ట్ వాంటెడ్ సినిమాగా రిలీజ్ అవ్వగా తొలి ఆటకే ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుని ఫ్యాన్స్ ని నిరాశపరిచింది. కానీ సినిమా అందుకున్న రెండు రికార్డులు ఇప్పటికీ చెక్కు చెదరలేదు.

ఇండియాలో ఈ ఇయర్ ఇప్పటివరకు విడుదల అయిన సినిమాల్లో తొలిరోజు 24.40 కోట్ల షేర్ వసూల్ చేసిన సినిమా ఇదొక్కటే అవ్వడం విశేషం అని చెప్పొచ్చు. కాగా రీసెంట్ గా సినిమాను మాటీవిలో ప్రసారం చేయగా అభిమానులు తమ అభిమానాన్ని సోషల్ మీడియాలో చాటుకున్నారు.

దాదాపు 35 వేల ట్వీట్స్ తో ట్విట్టర్ లో #సర్దార్ రోర్ ఆన్ టీవి అన్న హాష్ టాగ్ తో అన్ని వేల ట్వీట్స్ వేసి తమ అభిమాన్ని ఇండియా టాప్ ట్రెండింగ్ లో ఈ టాగ్ నిలిచేలా చేసి పవర్ స్టార్ ఫ్యాన్స్ పవర్ ఏంటో చూపించారు. సినిమాకు మంచి టి.ఆర్.పి వచ్చినట్లు మాటివి కూడా చెబుతుంది.

NO COMMENTS

LEAVE A REPLY