అక్కడ ప్యూర్ స్టార్ పవర్ అంటే ఏంటో చూపించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్

0
1617

ntr pure mass powerటాలీవుడ్ టాప్ హీరోల్లో మాస్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న హీరోగా గుర్తింపు తెచ్చుకున్న హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్. కెరీర్ లో ఎక్కువగా మాస్ సినిమాలు చేయడం వల్ల అనుకోవచ్చు మిగిలిన హీరోల కన్నా మాస్ లో ఎన్టీఆర్ కి తిరుగులేని ఇమేజ్ సొంతం అయ్యింది.

కాగా ఎన్టీఆర్ కి ఇక్కడితో పాటు కర్ణాటకలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. కాగా అక్కడ ఇప్పుడు జనతాగ్యారేజ్ సినిమా కనివినీ ఎరగని రీతిలో రిలీజ్ కి సిద్ధం అవుతుంది. ఇంతకుముందు సౌత్ సినిమాల్లో బాహుబలి అక్కడ సుమారు 350 థియేటర్స్ లో రిలీజ్ అయ్యి చరిత్ర సృష్టించింది.

కాగా ఆ సినిమా విడుదల అయిన 20 రోజుల్లోపే దాదాపు 8.5 కోట్ల షేర్ ని సాధించి రికార్డు స్థాయి విజయాన్ని సొంతం చేసుకుని బాహుబలి తరువాత స్థానంలో నిలిచింది. ఇదంతా ఒక్క ఎన్టీఆర్ స్టార్ పవర్ వల్లే జరిగిందని చెబుతున్నారు అక్కడి ట్రేడ్ పండితులు.

NO COMMENTS

LEAVE A REPLY