రామ్ చరణ్ ఊరమాస్ రికార్డ్….టోటల్ టాలీవుడ్ షాక్

0
894

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వెండితెరపై కనిపించి వచ్చే నెలతో ఏకంగా 1 ఏడాది పూర్తి కానుంది… కానీ రామ్ చరణ్ అప్ కమింగ్ సెన్సేషనల్ మూవీ మాత్రం ఇప్పుడే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా లేకపోవడంతో రామ్ చరణ్ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కాగా మెగా పవర్ స్టార్ సినిమా రిలీజ్ కి ఇంకా సమయం ఉన్నా బిజినెస్ లో దుమ్ము లేపుతూ దూసుకు పోతుంది.

సినిమాకి ఇప్పటి నుండే శాటిలైట్ రైట్స్ కింద దిమ్మతిరిగే ఆఫర్స్ వస్తుండటం విశేషం అనే చెప్పాలి. రీసెంట్ గా ఈ సినిమా కి శాటిలైట్ రైట్స్ కింద ఓ పెద్ద చానెల్ దిమ్మతిరిగే ఆఫర్ ఇచ్చినట్లు ఇండస్ట్రీ లో వార్తలు శిఖారు చేస్తున్నాయి.

ఆ రేటు అక్షరాలా 18 కోట్లు అని అంటుండటం తో ఇది టోటల్ ఇండస్ట్రీలోనే దిమ్మతిరిగే రికార్డ్ అని అంటున్నారు. తెలుగు సినిమాల్లో 16 కోట్లకు పైగా శాటిలైట్ రైట్స్ దక్కిన సినిమాలు తక్కువే అవ్వడంతో ఒకవేళ ఇది నిజం అయితే రామ్ చరణ్ సినిమా కి అల్టిమేట్ రికార్డ్ రావడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here