రంగస్థలం దెబ్బ కి చిట్టిబాబు బయపడ్డ వేల!!

0
683

మెగా పవర్ స్టార్ కెరీర్లో మరిచిపోలేని సినిమా ఏదైనా ఉందంటే… అది ‘రంగస్థలం’ సినిమానే. అంతకు ముందు తన రెండో సినిమా ‘మగధీర’తోనే ఇండస్ట్రీ రికార్డులు బద్దలుకొట్టినప్పటికీ అప్పుడు రాని ఆత్మసంతృప్తి… సౌండ్ ఇంజనీర్ చిట్టిబాబు ఇచ్చాడు చెర్రీ. ఇన్నాళ్లు తన నటనని విమర్శించిన వారందరికీ గట్టి సమాధానం ఇచ్చాడు చిట్టిబాబు. అయితే ఈ పాత్రను తనను  భయపెట్టింది అంటున్నాడు చరణ్. ‘సుకుమార్ కథ ఉంది అనగానే వన్ నేనొక్కడినే- నాన్నకు ప్రేమతో వంటి ఇంటెలిజెంట్ థ్రిల్లర్ చెబుతాడేమో అనుకున్నా. కానీ ఓ వెరైటీ కథ ఉందన్నాడు సుక్కూ. ఎంతో ఆసక్తిగా విన్నా. ఒక్కసారిగా హీరోకి వినికిడి లోపం ఉంటుందని చెప్పగానే భయమేసింది.

వరుసగా కమర్షియల్ సినిమాలు చేస్తున్నా… మధ్యలో ఇలాంటి ప్రయోగం అవసరమా… అనిపించింది. ఫ్యాన్స్ కూడా హీరోకి చెవుడంటే ఊరుకోరు. అయితే కథ మీద ఉన్న నమ్మకంతో చేయడానికి అంగీకరించా. హీరోకి వినికిడి లోపం ఉండడం వల్లే సినిమాలో కామెడీ- లవ్- ఎమోషన్ వంటి అన్ని కమర్షియల్ హంగులూ కుదిరాయి…’ అని చెప్పాడు మెగా పవర్ స్టార్. తాజాగా మంచు లక్ష్మీ ‘మేము సైతం’ కార్యక్రమంలో పాల్గొన్న రామ్ చరణ్… కొత్త కొత్త విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. 

మీ అభిమాన హీరో లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నాత్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ప్రెస్ చేయండి.ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి.👉

పెళ్లయిన తర్వాత చరణ్ చాలా కూల్ పర్సన్ అయిపోయాడని మంచు లక్ష్మీ అంది. దానికి ‘అంటే… ఉపాసన నా గాలి తీసేసిందంటావా? ఏంటి’ అంటూ సరదాగా పంచ్ వేశాడు చెర్రీ. ఉపాసన తన జీవితంలోకి రావడమే ది బెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్ అంటూ భార్య మీద తనకున్న ప్రేమను వ్యక్తం చేశాడు రామ్ చరణ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here