రామ్ చరణ్ టాప్ 2 గా నిలిచి రికార్డు సృష్టించిన ధృవ

0
1500

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో ఇప్పటివరకు 10 సినిమాలు చేయగా అందులో 7 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర 40 కోట్ల మార్క్ ని క్రాస్ అయ్యి సంచలనం సృష్టించి రామ్ చరణ్ కెరీర్ లో రేర్ రికార్డుగా నిలిచాయి.

కాగా అందులో మగధీరతో తొలిసారి 50 కోట్ల క్లబ్ ని నెలకొల్పిన రామ్ చరణ్ తర్వాత ఇప్పటివరకు ఆ క్లబ్ లో మరో సినిమాను చేర్చలేదు…మిగిలిన స్టార్ హీరోలు ఒకటికి రెండు సార్లు ఆ క్లబ్ లో ఎంటర్ అవ్వగా రామ్ చరణ్ ఎక్కువగా 48 కోట్లవరకు ఆగిపోయాడు.

నాయక్, ఎవడు 48 కోట్ల మార్క్ ని క్రాస్ చేయలేకపోయాయి. కాగా ఇప్పుడు ధృవ ఆ రెండు సినిమాలను క్రాస్ చేసి రామ్ చరణ్ కెరీర్ టాప్ 2 మూవీగా నిలిచింది. అన్నీ కుదిరితే సినిమా 55 కోట్ల మార్క్ ని అందుకునే చాన్స్ ఉన్నట్లు ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY