రామ్ చరణ్ రంగస్థలం రిలీజ్ డేట్ క్లారిటీ ఇదే!!

0
291

సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని షేక్ చేసే నిర్ణయం ఒకటి నిన్న సాయంత్రం బయటికి వచ్చింది. వచ్చే ఏడాది జనవరి 25న విడుదల కావాల్సిన శంకర్ విజువల్ వండర్ ‘2.0’ వేసవికి వాయిదా పడిపోయింది. దీపావళి నుంచి జనవరికి వాయిదా పడ్డ సినిమా.. ఇప్పుడు ఇంకో మూడు నెలలు వెనక్కి వెళ్లింది. ఈ చిత్రాన్ని తమిళ సంవత్సరాది కానుకగా ఏప్రిల్ 13న రిలీజ్ చేయడానికి నిర్ణయించారు.

దీంతో జనవరి.. ఫిబ్రవరి నెలల్లో రావాల్సిన సినిమాల మేకర్స్ ఊపిరి పీల్చుకోగా.. వేసవి సినిమాల దర్శక నిర్మాతల్లో గుబులు మొదలైంది. ‘2.0’ మీద ఉన్న అంచనాల ప్రకారం చూస్తే కనీసం నెల రోజుల పాటు దానికి గ్రౌండ్ వదిలేయాల్సిందే. ఐతే అటు తమిళంలో.. ఇటు తెలుగులో ఏప్రిల్ విడుదల కోసం చాలా సినిమాలు సన్నాహాలు చేసుకుంటున్నాయి. తెలుగు విషయానికి వస్తే.. ఏప్రిల్ నెలలో ‘రంగస్థలం’.. ‘భరత్ అను నేను’.. ‘నా పేరు సూర్య’ విడుదల కావాల్సి ఉంది.

వీటికి ఇప్పుడు ఇబ్బంది తప్పదు. ముఖ్యంగా ‘రంగస్థలం’ టీంకు ఇది బాగా ఇబ్బంది కలిగించే విషయమే. సంక్రాంతికే రావాల్సిన ఈ సినిమాను పవన్-త్రివిక్రమ్ సినిమా సంక్రాంతికే షెడ్యూల్ కావడంతో వాయిదా వేశారు. సంక్రాంతికి పోటీ ఎక్కువవుతుందని.. పైగా ‘2.0’ కూడా అదే నెలలో వస్తుండటంతో ఇబ్బంది అవుతుందని భావించి సంక్రాంతికి వెళ్లిపోయింది ‘రంగస్థలం’. కానీ ఇప్పుడు ఏప్రిల్ నెలలో తమ సినిమాను రిలీజ్ చేసుకునే పరిస్థితి లేదు.

దీని కంటే సంక్రాంతికే సినిమాను రిలీజ్ చేసుకుంటే.. లాంగ్ రన్ ఉంటుందని.. పవన్ సినిమా విడుదలైన రెండు మూడు రోజులకు రిలీజ్ చేస్తే ఇబ్బందేమీ ఉండదని ఆలోచిస్తున్నారట. కాకపోతే వేసవి విడుదల అని ఫిక్సయిపోయి కొన్ని రోజులుగా తాపీగా పని చేస్తోంది సుక్కు అండ్ టీం. సంక్రాంతికే వద్దామనుకుంటే.. ‘నాన్నకు ప్రేమతో’కు కష్టపడ్డట్లు రేయింబవళ్లు కష్టపడాల్సి ఉంటుంది సుక్కు. తప్పదనుకుంటే అలా కష్టపడాల్సిందే మరి. చూద్దాం మరి ఏం చేస్తారో?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here