సినిమా తరువాత ‘భరత్ అనే నేను’ .. ‘నా పేరు సూర్య’ వంటి పెద్ద హీరోల సినిమాలు వచ్చినా, అవి ‘రంగస్థలం’ సినిమా వసూళ్లపై చూపించిన ప్రభావం చాలా తక్కువనే చెప్పాలి. వసూళ్ల పరంగా .. నటన పరంగా చరణ్ కెరియర్లోనే ఇది చెప్పుకోదగిన చిత్రంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 210 కోట్లకి పైగా గ్రాస్ ను సాధించిన ఈ సినిమా, 124 కోట్లకి పైగా షేర్ ను రాబట్టింది. కథ .. కథనాలు .. సంగీత సాహిత్యాలు .. చిత్రీకరణ ఈ సినిమాకి ప్రధానబలంగా నిలిచి, ఈ స్థాయి విజయాన్ని కట్టబెట్టాయి.