సరైనోడు “కర్ణాటక” కలెక్షన్స్ లో నిజమెంత

0
943

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ సరైనోడు రెండు తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము రేపే కలెక్షన్స్ తో 60 కోట్ల మార్క్ అందుకుని అల్లుఅర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. టోటల్ గా 70 కోట్ల కలెక్షన్స్ వైపు అడుగులేస్తున్న ఈ సినిమా కర్ణాటక కలెక్షన్స్ పై ఇండస్ట్రీలో రచ్చ జరుగుతుంది.

sarainodu collections controversyకర్ణాటక ట్రేడ్ పండితుల లెక్కల ప్రకారం అక్కడ సరైనోడు టోటల్ రన్ లో 6 కోట్ల షేర్ దాకా కలెక్ట్ చేశారని చెబుతున్నారు. ఇంకా ఎక్కువ కలెక్ట్ చేసేదే కానీ అక్కడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చక్రవ్యూహ్ భారీ ఎత్తున రిలీజ్ అవ్వడంతో సరైనోడు థియేటర్ లు 80% తీసుకున్నారు.

దానికితోడు చక్రవ్యూహ్ కి పాజిటివ్ టాక్ రావడంతో సరైనోడు టోటల్ గా డల్ అయిపోగా ఇప్పుడు కర్ణాటకలో ఇప్పటివరకు సరైనోడు కలెక్షన్స్ 7.40 కోట్లు అంటూ కొన్ని సైట్లు ప్రచారం చేస్తున్నాయి. దాంతో అంత వచ్చే చాన్సే లేదని విశ్లేషకులు అంటున్నారు. మరి ఈ ఇద్దరిలో ఎవరిలెక్కలు నిజమో తెలియడం లేదు.

NO COMMENTS

LEAVE A REPLY