సర్దార్ గబ్బర్ సింగ్ ఈ దశాబ్దపు అతిపెద్ద డిసాస్టర్

0
614

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ ఫ్లాఫ్ టాక్ తోనూ 50 కోట్ల మార్క్ ని అవలీలగా దాటి బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్ సినిమాలకు కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసి ఉండొచ్చు కానీ టోటల్ వరల్డ్ వైడ్ గా 100 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా మొత్తంమీద 45 కోట్ల నష్టం రానుంది.

sardhar gabbar sing didastఇంతకుముందు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 1 నేనొక్కడినే సినిమా 72 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా టోటల్ గా 30 కోట్లవరకు షేర్ కలెక్ట్ చేసి డిసాస్టర్ ఆఫ్ ది డికేట్ గా నిలిచింది. ఆ రికార్డును పవన్ కళ్యాణ్ బ్రేక్ చేసి మహేష్ పేరిట ఉన్న 42 కోట్ల రికార్డును తన సినిమా సర్దార్ తో 45 కోట్ల రికార్డుగా మార్చబోతున్నాడు.

ఇప్పటికి సుమారు 53 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన సర్దార్ గబ్బర్ సింగ్ టోటల్ గా 55 కోట్లవరకు కలెక్ట్ చేసే చాన్స్ ఉంది. దాంతో మొత్తంగా 45 కోట్ల లాస్ వెంచర్ గా పవన్ పేరిట పరమ చెత్త రికార్డును తీసుకురాబోతుంది ఈ సినిమా.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY