సెప్టెంబర్ లో రికార్డులు సృష్టించే చాన్స్ ఉన్న సినిమాలు ఇవే

0
185

sept lo smtyhabsపండగల సీజన్ లో అయినా సెలవల సీజన్ లో అయినా వరుసగానో.. ఒకేసారో ఎక్కువగా సినిమాలు రిలీజ్ చేయడం జరుగుతుంది. సాధారణంగా సంక్రాంతి.. సమ్మర్.. దసరా.. దీపావళి పండగల టైమ్ లో ఎక్కువ సినిమా రిలీజ్ లు చూస్తూ ఉంటాం. కానీ ఈ సారి మాత్రం సెప్టెంబర్ బాగా వేడెక్కేసింది.

ప్రతీ నెలలో ఒకటో రెండో చెప్పుకోదగ్గ సినిమాలు.. ఓ అరడజన్ చిన్న సినిమాలు రావడం కామన్. సెప్టెంబర్ లో వస్తున్నట్లు ఇప్పటికే చెప్పిన సినిమాల లిస్ట్ చూస్తే.. కెవ్ అనాల్సిందే. సెప్టెంబర్ 2న వస్తున్న ఎన్టీఆర్-కొరటాల సినిమాతో మొదలుపెడితే.. అన్నీ భారీ చిత్రాలే.

మిల్కీ బ్యూటీ తమన్నా అభినేత్రి.. నేచురల్ స్టార్ నాని నటిస్తున్న మజ్ను.. నాగ చైతన్య మూవీ ప్రేమమ్.. గోపీచంద్ సినిమా ఆక్సిజన్.. పూరీ-కళ్యాణ్ రామ్ ల ఇజం.. ఎనర్జిటిక్ హీరో రామ్ చూపించే హైపర్.. ఇవీ ఇప్పటివరకూ సెప్టెంబర్ కి షెడ్యూల్ చేసిన సినిమాలు.

ఆ నెలలో 5 శుక్రవారాలున్నా.. 7 క్రేజీ ప్రాజెక్టులు క్యూ కట్టేశాయి. దసరా మధ్యలో రామ్ చరణ్ ధృవ వస్తోంది కాబట్టి.. ఈ లోగానే ఈ సినిమాలన్నీ వసూళ్లు రాబట్టేయాలి. లేకపోతే థియేటర్స్ సమస్య వస్తుంది. అందుకే ఇంతగా సెప్టెంబర్ ని వేడెక్కించేశారు. వర్షాకాలంలో ఇంత వేడిని ఎన్ని సినిమాలు తట్టుకుంటాయో!

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY