షాకింగ్ న్యూస్::-ఖైదీనంబర్150 లో ఆ సీన్ ని తొలగించేశారట

0
1900

టాలీవుడ్ ఆల్ టైం మెగాస్టార్ చిరంజీవి 9 ఏళ్ల తర్వాత కంబ్యాక్ చేస్తున్న మైటీ మూవీ ఖైదీనంబర్150 సెన్సార్ పనులను రిలీజ్ కి 15 రోజుల ముందే పూర్తి చేసుకుని జనవరి 11 న ఘనంగా రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతుంది.

కాగా సినిమాని చూసిన సెన్సార్ వారు ఓ సీన్ గురించి పదే పదే చెబుతున్నారని ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఒరిజినల్ తమిళ్ కత్తిలో విజయ్ ని పోలిస్ స్టేషన్ లో కేవలం డ్రాయర్ మీదే కూర్చోబెట్టి పోలీసులు చిత్ర హింసలు పెడతారు…ఆ సీన్ కి ఆడియన్స్ హృదయాలు కరిగిపోతాయి తమిళ్ లో.

అలాంటి ఆయువు పట్టు సీన్ ని తెలుగులో ఎలా తీశారో అని చూసినవాళ్ళు ఎదురుచూడగా ఆ సీన్ ని టోటల్ గా తొలగించినట్లు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ఒరిజినల్ కత్తిలో హీరో క్యారెక్టర్ పై ఎంతో ఇంపాక్ట్ చూపిన ఆ సీన్ లేకపోవడం రీమేక్ కి ప్లస్ అవుతుందా లేక మైనస్ అవుతుందా అని ఇప్పుడు అంతా అనుకుంటున్నారు…

NO COMMENTS

LEAVE A REPLY