సాంగ్ రిలీజ్ కే వరల్డ్ వైడ్ ట్రెండింగ్…వీర లెవల్ విద్వంసం ఇది

0
769

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక 25 వ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా పవన్ మరియు త్రివిక్రమ్ ల కాంబో లో వస్తున్న మూడో సినిమా అవ్వడం తో టాలీవుడ్ లో ఈ సినిమా అత్యంత భారీ అంచనాలు ఏర్పడ్డాయి అని చెప్పొచ్చు. కాగా సినిమా ఫస్ట్ లుక్ ని 7 వ రివీల్ చేయనున్నారు.

అదే రోజున సినిమా లోని ఫస్ట్ సాంగ్ లిరిక్ వీడియో ని రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేయగా… ఎప్పుడెప్పుడు అప్ డేట్ వస్తుందా అని ఎదురు చూస్తున్న పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈ న్యూస్ తెలిసిన వెంటనే నిమిషాల్లో వరల్డ్ వైడ్ గా ట్రెండ్ చేసి సంచలనం సృష్టించారు.

కేవలం 15 నిమిషాల్లోనే వరల్డ్ వైడ్ గా ట్రెండ్ అయిన   సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేసింది అని చెప్పొచ్చు. అనిరుద్ కంపోజ్ చేసిన సంగీతం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో అని ఇప్పుడు అందరు ఎదురు చూస్తున్నారు. సినిమా అనుకున్న విధంగానే సంక్రాంతి కానుకగా రిలీజ్ కావడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here