సుకుమార్ కి రామ్ చరణ్ రిక్వెస్ట్…ఏంటో తెలిస్తే షాక్??

0
1330

గోవిందుడు అందరివాడేలే సినిమా టైమ్‌ నుంచి తన చిత్రాలకి అవుతోన్న ఖర్చుని చరణ్‌ ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నాడు. ఓవర్‌ బడ్జెట్‌ అయితే తన పారితోషికం తిరిగి ఇవ్వడం లేదా బ్యాలెన్స్‌ అమౌంట్‌ తీసుకోకపోవడం చేస్తున్నాడు. ధృవ చిత్రాన్ని కూడా బడ్జెట్‌లో చేయడానికి, తక్కువ ధరలకి అమ్మడానికి చరణ్‌ కారణం. తాజాగా రంగస్థలం 1985 విషయంలోను చరణ్‌ ఇదే పద్ధతి ఫాలో అవుతున్నాడట. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్‌ లాంటి హిట్‌ సినిమాలు తీసిన మైత్రి మూవీస్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

ఈ చిత్రానికి అవుతోన్న పెట్టుబడిని చెక్‌లో పెడుతోన్న చరణ్‌ పెట్టుబడి ఎక్కడైనా ఎస్టిమేట్‌ దాటితే దానిని పారితోషికంలో తగ్గిస్తున్నాడట. ఈ చిత్రాన్ని ముందుగా కోనసీమలో తీద్దామని అనుకున్నారు. కానీ జనాల మధ్య స్టార్‌ హీరో సినిమా షూటింగ్‌ సజావుగా సాగకపోవడంతో సెట్‌ వేసి తీస్తున్నారు.

దీని కోసం సెట్‌ నిర్మాణానికే అయిదారు కోట్లు అయిందట. ఈ భారం నిర్మాతపై పడకుండా తన పారితోషికంలో తగ్గించుకోవడమే కాకుండా దర్శకుడు సుకుమార్‌ని కూడా రెమ్యూనరేషన్‌ తగ్గించుకోవాలని అడిగాడట. చరణ్‌ అడిగాక ఇక కాదనేది ఏముంది? సుకుమార్‌ కూడా తన పారితోషికంలో ముప్పయ్‌ శాతం తగ్గించుకున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here