తన ఆల్ టైం రికార్డును తానే బ్రేక్ చేయడానికి వస్తున్న యంగ్ టైగర్

0
1237

ntr-dfsdterటాలీవుడ్ చరిత్రలో తనకంటూ కొన్ని రికార్డులను సృష్టించుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. కెరీర్ లో దాదాపు 13 ఏళ్లకి ఓ నికార్సయిన బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకున్న యంగ్ టైగర్ ఇప్పుడు తన పేరిట ఉన్న మరో రికార్డును కొల్లగొట్టడానికి సిద్ధం అవుతున్నాడు.

టాలీవుడ్ సినీ హిస్టరీలో టెలివిజన్ లో ప్రసారం అయిన సినిమాల్లో ఎన్టీఆర్ టెంపర్ సినిమా అత్యధికంగా 26 టి.ఆర్.పి రేటింగ్ తెచ్చుకుని సంచలనం సృష్టించింది. ఎన్నో భారీ బ్లాక్ బస్టర్స్ క్రేజీ మూవీస్ రిలీజ్ అయినా ఒక్కటి కూడా టెంపర్ దరిదాపుల్లోకి వెళ్ళలేకపోయింది.

దాంతో తన పేరిట ఉన్న రికార్డును తానె బ్రేక్ చేయడానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ దసరాకి నాన్నకుప్రేమతో సినిమాతో టెలివిజన్ లో అడుగుపెట్టబోతున్నాడు. సంక్రాంతి సీజన్ సూపర్ హిట్ గా నిలిచిన నాన్నకుప్రేమతో ఇప్పుడు టెలివిజన్ లోను రికార్డు స్థాయి టి.ఆర్.పి ని సొంతం చేసుకుంటుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY