యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ టన్నులకు టన్నులు

0
1530

ntr-s-vtbsmntయంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకప్పటిలా లేదు…ఓ రెండేళ్ళ క్రితం ఎన్టీఆర్ అంటే వరుస ఫ్లాఫుల్లో ఉన్న హిరోగానే అందరికీ తెలుసు. కానీ ఎప్పుడైతే టెంపర్ సినిమా చేశాడో అప్పటి నుండే మరో ఎన్టీఆర్ అందరికీ తెలిసాడు. ఆ కొత్త ఎన్టీఆర్ ఆ ఒక్క సినిమాతో ఆగిపోకుండా నాన్నకుప్రేమతో, జనతాగ్యారేజ్ అంటూ డిఫెరెంట్ సినిమాలు చేస్తూనే ఉన్నాడు.

ఈ గ్యాప్ లో ఎన్టీఆర్ కి పెరిగిన క్రేజ్ కూడా టన్నులకు టన్నులు పెరిగింది అని చెప్పొచ్చు. రెండేళ్ళ క్రితం ఎన్టీఆర్ సినిమాలకు ఓపెనింగ్స్ మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు ఆ ఓపెనింగ్స్ ఆల్ టైం రికార్డులను కూడా బ్రేక్ చేసేలా మారిపోయాయి.

ఇలాంటి క్రేజ్ కోసం దాదాపు 13 ఏళ్ళు ఎదురుచూసిన ఎన్టీఆర్ ఇక పాత ఎన్టీఆర్ ని బయటికి తీయకుండా కొత్త ఎన్టీఆర్ నే ప్రేక్షకులను అలరించడానికి వాడాలని ఎన్టీఆర్ నిర్ణయం తీసుకున్నాడు. ఇలాగే కొత్త ప్రయోగాలు చేస్తూ తనలో ఉన్న నటున్ని మరింతగా మెరుగు పరుచుకోవాలని భావిస్తున్న ఎన్టీఆర్ కి జోహార్లు చెప్పకుండా ఉండలేము.

NO COMMENTS

LEAVE A REPLY