తెలుగు సినిమాపై తమిళ్ సినిమా అటాక్….షాక్ లో ఇండస్టీ

0
552

  మంచు మనోజ్ కొత్త సినిమా ‘ఒక్కడు మిగిలాడు’ శ్రీలంకలో తమిళుల పోరాటం మీద.. వారి అవస్థల మీద తీసిన సినిమా అన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం వచ్చే శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ వీకెండ్లో దీంతో పాటుగా ఇంకో నాలుగు సినిమాలు రిలీజవుతుండటం విశేషం. ఆ నాలుగు సినిమాలూ తమిళ అనువాదాలే కావడం గమనార్హం. ముందుగా గురువారం విజయ్ సినిమా ‘అదిరింది’ విడుదలవుతుంది. ఆ తర్వాతి రోజు సందీప్ కిషన్ నటించిన ద్విభాషా చిత్రం ‘కేరాఫ్ సూర్య’ రిలీజవుతుంది.

పేరుకిది ద్విభాషా చిత్రమైనా.. వాస్తవానికి ఇది తమిళ చిత్రమే. మరోవైపు గత శుక్రవారమే విడుదల కావాల్సి ఉన్నా.. థియేటర్ల సమస్యతో వాయిదా పడ్డ సిద్ధార్థ్ సినిమా ‘గృహం’ కూడా వచ్చే శుక్రవారమే రిలీజవుతుంది. విశాల్ మూవీ డబ్బింగ్ మూవీ ‘డిటెక్టివ్’ కూడా అదే రోజు వస్తుంది.

మొత్తానికి తమిళుల నేపథ్యంలో తీసిన తెలుగు సినిమాకు తోడు.. నాలుగు తమిళ డబ్బింగ్ సినిమాలు ఒకే వీకెండ్లో వస్తాయన్నమాట. ఇలా టాలీవుడ్ బాక్సాఫీస్ మీద తమిళ దాడి చూడబోతున్నాం వచ్చే వీకెండ్లో. గతంలో తమిళ అనువాదాలు ఇక్కడ తెగ ఆడేసేవి కానీ.. గత కొన్నేళ్లలో డబ్బింగ్ సినిమాల జోరు బాగా తగ్గిపోయింది. మళ్లీ చాన్నాళ్ల తర్వాత అనువాదాల జోరు చూడబోతున్నాం. మరి వీటిలో ఏవి ఏమాత్రం పెర్ఫామ్ చేస్తాయో చూద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here