అప్పుడు 6 వ ర్యాంక్ మరి ఇప్పుడు ఎన్టీఆర్ ర్యాంక్ ఇదే

0
2629

ntr-ens-mbntnయంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ మొదట్లోనే ఆది-సింహాద్రి సినిమాలతో తన రేంజ్ ఏంటో చూపించుకున్న ఒకేఒక్కడు. తరువాత సరైన కథలను ఎంచుకోవడంలో విఫలం అయిన ఎన్టీఆర్ క్రమంలో మిగత స్టార్స్ తో పోల్చుకు౦టే ఫామ్ కోల్పోయాడు.

అయినా ప్రతీ సినిమాకు రికార్డ్ స్థాయి ఓపెనింగ్స్ ఎన్టీఆర్ కి నూతన ఉత్సాహాన్ని నింపినా సరైన విజయం మాత్రం దక్కలేదు. దాంతో 2015 టెంపర్ కి ముందు వరకు ఎన్టీఆర్ పవన్-మహేష్-రామ్ చరణ్-అల్లుఅర్జున్-ప్రభాస్ లతో పోల్చుకుంటే క్రమంగా వెనకబడినట్లే అయ్యాడు.

కానీ టెంపర్ నుండే మళ్ళీ జోరు అందుకున్న ఎన్టీఆర్ ఒక్కొక్కరిని వెనక్కి నెట్టి ఇప్పుడు జనతాగ్యారేజ్ హ్యూమ౦గస్ సక్సెస్ తో ఏకంగా 3 వ ర్యాంక్ కి ఎదిగాడు. మరో రెండేళ్లలో ఇదే ఫామ్ ని కొనసాగిస్తే టాప్ ప్లేస్ కూడా ఎన్టీఆర్ సొంతమే అని విశ్లేషకులు అనేంతంగా పెరిగింది యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ ఇప్పుడు.

NO COMMENTS

LEAVE A REPLY