టోటల్ ఇండస్ట్రీ బిగ్ షాక్..సైరా ఇలా జరిగిందేమిటి.?కారణం అదేనా..?

0
1363

గత సంవత్సరం ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా తరువాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా నరసింహారెడ్డి’ అనే సినిమా చేస్తున్నాడు.ఇక రీసెంట్ చిరంజీవి పుట్టినరోజు కానుకగా రామ్ చరణ్ సైరా టీజర్ ని విడుదల చేసాడు. ఈ టీజర్ కి అందిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

అయితే ఈ టీజర్ ఇప్పటికే 11 మిలియన్ల  డిజిటల్ వ్యూస్ దాటేసిన సైరా ఇప్పటికీ హాట్ టాపిక్ గానే ఉంది.ఫస్ట్ డే 9 మిలియన్లు దాటేసిన ఏ టీజరైనా సరే  సాధారణంగా ఇండియాకు సంబంధించి ట్రెండింగ్ లో ఉండటం సాధారణం. కానీ విచిత్రంగా సైరా టీజర్ టాప్ లిస్ట్ లో లేకపోవడం మెగా అభిమానులని సైతం విస్మయపరిచింది.దీనికి కారణాలు ఇంకా తెలియలేదు కానీ సాంకేతికంగా జరిగే పొరపాట్లు ఇలాంటి వాటికి దారి తీస్తాయి.   

టీజర్ విడుదలైన ఐదారు గంటల వరకు వ్యూస్ తో మోతెక్కిపోయిన సైరా ఆ సమయంలో హెడ్డింగ్ కింద ఎరుపు రంగులో ఉండాల్సిన ట్రెండింగ్ ట్యాగ్  కూడా లేకపోవడం కొత్త అనుమానాలు రేపింది. ఎవరు చూడకపోతే అన్నేసి మిలియన్ల వ్యూస్ ఎలా వస్తాయి అనే మెగా ఫ్యాన్స్ ప్రశ్న సహేతుకమైందే.

మీ అభిమాన హీరో లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నాత్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ప్రెస్ చేయండి.ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి.👉

మరి ఎక్కడ పొరపాటు జరిగిందో లేక నిజంగానే సైరా గురించి ట్రెండింగ్ జరగలేదో తెలియదు కానీ  ఈ అంశం సోషల్ మీడియాలో కొంత వరకు ట్రాలింగ్ కు గురి కావడం మెగా ఫాన్స్ ని ఇబ్బంది పెట్టింది. ఇన్ని ప్రశంశలు సపోర్ట్ దక్కిన తర్వాత కూడా ఆ టీజర్ ట్రెండ్ లో లేకపోవడం వెనుక కారణాలు విశ్లేషించాలని మెగాస్టార్ అభిమానులు కోరుతున్నారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here