ట్రైలర్ కూడా రిలీజ్ చేయని ఆ సినిమా టోటల్ కలెక్షన్స్ 140 కోట్లు

1
1423

బడ్జెట్ పెరిగింది బడ్జెట్ పెరిగింది అని మనం గగ్గోలు పెడుతున్నాం కానీ ఇప్పటికీ కొన్ని సినిమాల బడ్జెట్ విషయంలో చాలా లో ప్రొఫైల్ లో సినిమాలు తీసి బాక్స్ ఆఫీస్ దగ్గర ఘనవిజయాలను సొంతం చేసుకుంటున్నాయి. టాప్ హీరోతో సినిమా అంటే 50 కోట్లు పెట్టాల్సిందే అని అంతా అనుకుంటున్నారు. కానీ అదే టాప్ హీరో తన రెమ్యునరేషన్ ని తక్కువ చేసుకుని సినిమా బడ్జెట్ ని తక్కువ చేస్తే ఆ సినిమాకు కచ్చితంగా లాభాలు వస్తాయి.

140 cr for that movieలాస్ట్ ఇయర్ కోలివుడ్ లో ఓ సినిమాకు ఇలాగే జరిగింది. రజినీకాంత్ తరువాత అంతటి ఫాలోయింగ్ ఉన్న హీరో అజిత్ నటించిన వేదాలం సినిమా టోటల్ బడ్జెట్ 25 కోట్ల లోపే అట. హీరో అజిత్ అలాగే దర్శకుడు శివ సినిమా బడ్జెట్ ను తగ్గించడానికి తమ రెమ్యునరేషన్ ను తీసుకోకుండా సినిమాకు వచ్చిన లాభాల్లో షేర్ తీసుకోవాలని డిసైడ్ అయ్యారట.

సినిమా కూడా వీరి అంచనాలను ఏమాత్రం వొమ్ము చేయకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ రేంజ్ లో హిట్ అయ్యి టోటల్ గా 140 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసి ఆల్ టైం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంతేకాకుండా టోటల్ షేర్ 74 కోట్లుకు పైగా కొల్లగొట్టిన ఈ సినిమా అజిత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దాంతో మొత్తంగా 25 కోట్లు పెట్టి సినిమా తీస్తే టోటల్ గా 115 కోట్ల లాభం సంపాదించింది.

1 COMMENT

LEAVE A REPLY