అందరికీ లాస్…ఈయన కి ప్రాఫిట్…ఉన్నది ఒకటే జిందగీ షాకింగ్ కలెక్షన్స్

0
2224

రామ్ సినిమా ‘ఉన్నది ఒకటే జిందగీ’కి డివైడ్ టాక్ వచ్చింది. కొందరు ఈ సినిమా బాగుందన్నారు. ఇంకొందరు నెగెటివ్ గా మాట్లాడారు. ఐతే ఈ సినిమాకు స్లోగా సాగే సెకండాఫ్ మైనస్ అయిందన్నది వాస్తవం. ఐతే ఈ చిత్రం తొలి వారాంతంలో మంచి వసూళ్లే సాధించింది. రూ.11 కోట్ల దాకా షేర్ వసూలు చేసి రామ్ కెరీర్లో హైయెస్ట్ ఫస్ట్ వీకెండ్ గ్రాసర్ గా నిలిచింది. కానీ వీకెండ్ తర్వాత సినిమా వీక్ అయినట్లుగా ట్రేడ్ పండిట్లు చెప్పారు. కానీ సెకండ్ వీకెండ్లో ఈ సినిమా కొంచెం పుంజుకుంది. ‘గరుడవేగ’ మినహా సినిమాలకు నెగెటివ్ టాక్ రావడం..

  ‘గరుడవేగ’ కూడా కొంచెం లేటుగా పుంజుకోవడం ‘ఉన్నది ఒకటే జిందగీ’కి కలిసొచ్చింది. వీకెండ్లో ఈ చిత్రానికి ఓ మోస్తరు వసూళ్లే వచ్చాయి. కొందరేమో ‘జిందగీ’ ఫ్లాప్ అని ముందే తీర్మానించేయగా.. నైజాం ఏరియాలో ఈ చిత్రం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజుకు లాభాలు అందిస్తుండటం విశేషం. ఈ చిత్రాన్ని నైజాంకు రూ.6.1 కోట్లకు కొన్నాడు రాజు.

సెకండ్ వీకెడ్ అయ్యేసరికి ఈ చిత్రం తెలంగాణలో రూ.6.2 కోట్ల షేర్ రాబట్టడం విశేషం. మొదట్నుంచి ఈ సినిమా నైజాంలో బాగా ఆడుతోంది. తొలి వారంలోనే రూ.4.6 కోట్ల షేర్ రాబట్టింది. రెండో వారాంతంలో రూ.1.6 కోట్ల షేర్ రాబట్టి పర్వాలేదనిపించింది. మిగతా ఏరియాల్లో ఈ సినిమా ఇంకా బ్రేక్ ఈవెన్ కు రావాల్సి ఉంది. మొత్తంగా ‘ఉన్నది ఒకటే జిందగీ’ ఇప్పటిదాకా రూ.16 కోట్ల దాకా షేర్ రాబట్టినట్లు అంచనా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here