నేల టికెట్లు ను వద్దన్న హీరో ఎవరబ్బా!!

0
605

టాలీవుడ్లో ఒక హీరో వద్దన్న కథను మరో హీరో ఓకే చేసి సినిమా చేయడం మామూలే. ఇలా ఒకరి నుంచి ఇంకొకరికి బదిలీ అయిన కథలు చాలానే ఉన్నాయి. ఇలా వేరే వాళ్లు రిజెక్ట్ చేసిన సినిమాలు చేయడంలో మాస్ రాజా రవితేజ ముందుంటాడు. ఎలాంటి శషబిషలు పెట్టుకోకుండా ఈ స్టయిల్లో చాలా సినిమాలు చేశాడు మాస్ రాజా. రవితేజ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచిన ‘భద్ర’ దగ్గర్నుంచి గత ఏడాది వచ్చిన ‘రాజా ది గ్రేట్’ వరకు రవితేజ ఇలా ‘మారు’ సినిమాలు చేస్తూనే వస్తున్నాడు. తాజాగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేయలేకపోయిన ‘తెరి’ రీమేక్ ను కూడా మాస్ రాజానే చేస్తున్న సంగతి తెలిసిందే. అదే కాదు.. వచ్చే వారాంతంలో రాబోయే ‘నేల టిక్కెట్టు’ కూడా వేరే హీరో రిజెక్ట్ చేసిందేనట. ఈ విషయాన్ని దర్శకుడు కళ్యాణ్ కృష్ణనే స్వయంగా వెల్లడించాడు.

‘నేల టిక్కెట్టు’ కథను వేరే హీరోను దృష్టిలో ఉంచుకుని రాశానని.. కానీ అనివార్య కారణాల వల్ల ఆ హీరోతో సినిమా వర్కవుట్ కాలేదని.. దీంతో మాస్ రాజాకు కథ వినిపించగా ఆయన ఒప్పుకున్నారని కళ్యాణ్ చెప్పాడు. ఐతే రవితేజ ఈ ప్రాజెక్టులోకి వచ్చాక ఆయన శైలికి తగ్గట్లుగా కథలో మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించినట్లు కళ్యాణ్ తెలిపాడు. ‘నేల టిక్కెట్టు’లో రవితేజ నుంచి ఆశించే అన్ని అంశాలు ఉంటాయని..

మీ అభిమాన హీరో లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నాత్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ప్రెస్ చేయండి.ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి.👉

ఇది ప్రధానంగా మాస్ ను లక్ష్యంగా చేసుకున్న సినిమా అని.. అలాగని క్లాస్ ప్రేక్షకులకు నచ్చకుండా ఏమీ ఉండదని కళ్యాణ్ తెలిపాడు. రవితేజ నుంచి ప్రేక్షకులు ప్రధానంగా వినోదం ఆశిస్తారని.. ఇందులో 70 శాతం కామెడీనే ఉంటుందని.. అలాగే యాక్షన్ అంశాలకూ లోటు ఉండదని అన్నాడు కళ్యాణ్. రామ్ తాళ్లూరి నిర్మించిన ‘నేల టిక్కెట్టు’లో మాస్ రాజా సరసన మాళవిక శర్మ అనే కొత్తమ్మాయి నటించింది. ‘ఫిదా’ ఫేమ్ శక్తికాంత్ సంగీతాన్నందించాడు. వచ్చే శుక్రవారమే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here