రాజమౌళి ఎందుకు స్పందించలేదు….టాలీవుడ్ షాక్

0
835

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఎప్పటికప్పుడు ట్రెండ్ కి తగినట్లుగా తన మేకింగ్ స్టైల్ ను అప్ డేట్ చేసుకుంటూ.. అప్ గ్రేడ్ చేసుకుంటూ ఉంటాడు. అలాగే లేటెస్ట్ మూవీస్ విషయంలో చాలానే అప్డేడెట్ గా ఉంటాడీయన. మంచి సినిమాలకు తనదైన రివ్యూలు ఇస్తూ పొగడ్తలతో ముంచెత్తుతుంటాడు. ఇది ఆయా సినిమాలపై జనాల్లో కూడా విశ్వాసం పెరగడానికి కారణం అవుతుంది. అఫ్ కోర్స్.. తనకు దగ్గరైన దర్శక నిర్మాతల సినిమాలు అంతగా ఆకట్టుకోకపోయినా.. జక్కన్న పొగడ్తలు కురిపించడం కొన్ని సార్లు విమర్శలకు దారి తీసింది.

అయినా సరే.. రాజమౌళి రివ్యూలు అంటే జనాలకు గురి ఉంది. రాజశేఖర్ మూవీ గరుడవేగ రిలీజ్ అయిన తర్వాత.. సినిమా గురించి విన్నానని.. సండే నాడు టికెట్స్ బుక్ చేసుకున్నానని ట్వీట్ చేశాడు రాజమౌళి. కానీ సినిమా చూసొచ్చిన తర్వాత.. ఒక్క మాట కూడా గరుడవేగకు పాజిటివ్ గా పోస్ట్ చేయలేదు. కొత్త తరం థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ అందించిన గరుడవేగపై రాజమౌళి ట్వీట్ వేయకపోవడం ఆశ్చర్యకరమే.

అయితే.. బాహుబలిలో దేవసేనగా మెప్పించిన అనుష్క నటించిన లేటెస్ట్ మూవీ భాగమతి ఫస్ట్ లుక్ పోస్టర్ పై మాత్రం ట్వీట్ వేసిన రాజమౌళి.. గరుడవేగపై కూడా ఓ చిన్నపాటి ట్వీట్ అయినా వేసి ఉంటే.. అది సినిమాకు మరింత హెల్ప్ అవుతుందనే ఒపీనియన్స్ వినిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here