అవును….ఆ సీన్ చేసేటప్పుడు భయపడ్డాను అంటున్న ఎన్టీఆర్

0
1208

ntr-dcsghయంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏంటి ఓ సీన్ చేయడానికి భయపడటం ఏంటని అనుకుంటున్నారా….టాలీవుడ్ లో బెస్ట్ యాక్టర్స్ లో ఎన్టీఆర్ పేరు ముందు నిలవడం ఖాయం. అలాంటి ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ జనతాగ్యారేజ్ ఓ సీన్ చేయడానికి చాలా భయపడ్డాడట.

కానీ ఆ సీన్ ని ఇప్పుడు చూస్తున్నవాళ్ళు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఇంతకీ ఆ సీన్ ఏంటో తెలుసా…జనతాగ్యారేజ్ లో వచ్చే ఇంటర్వెల్ సీన్. మొదట ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ తో ఇంటర్వెల్ సీన్ తీయాలి అనుకున్నా తరువాత స్టొరీ చూసుకుని కొంచం డిఫెరెంట్ గా చేద్దామని ఎన్టీఆర్-మోహన్ లాల్ ల కాంబినేషన్ లో ఆ సీన్ ని తీశారు.

షూటింగ్ మొదలైనప్పటి నుండి కేవలం ఒకేసారి కలిసిన ఈ ఇద్దరు స్టార్స్ రెండో సారి ఆ సీన్ లో కలవడంతో మోహన్ లాల్ లాంటి కంప్లీట్ యాక్టర్ తో నటించడానికి మొదట భయపడ్డాడట ఎన్టీఆర్. కానీ ఆ సీన్ కి ముందు మోహన్ లాల్ మరియు ఎన్టీఆర్ లు ఓ గంట కూర్చును మాట్లాడుకోవడం జరిగిందట.

ఇంతలో ఇద్దరికీ ఒకరిగురించి ఒకరికి కొంతో గొప్పో తెలియడంతో ఆ సీన్ ని ఎన్టీఆర్ బెరుకు లేకుండా చేశాడట. కానీ ఇప్పుడు ఆ సీన్ కి థియేటర్స్ లో వస్తున్న రెస్పాన్స్ చూసి ఆనందపడిపోతున్నాడు ఎన్టీఆర్.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY