ఎన్టీఆర్ తో సినిమా తీసి తన లెక్క సెట్ చేయాలి అనుకుంటున్న స్టార్ డైరెక్టర్

0
701

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోలలో ఒకడు…5 వరుస విజయాలతో ఇప్పుడు అందరు డైరెక్టర్స్ ల హాట్ ఫేవరేట్ అయిపోయిన ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి దర్శకుల క్యూ రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది.

ఈ క్యూలో ఎన్టీఆర్ కి హిట్ ఇచ్చినవాళ్ళు ఉన్నారు-ఫ్లాఫ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు-కొత్తగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్న కొత్త దర్శకులు ఉన్నారు. ఎన్టీఆర్ తో 2012 లో దమ్ము అనే యావరేజ్ సినిమా తీసిన బోయపాటి శీను ఇప్పుడు మళ్ళీ ఎన్టీఆర్ తో చేయడానికి ఉత్సాహపడుతున్నాడు.

బోయపాటి శ్రీను ఎన్టీఆర్ తో సినిమా తీసి తన లెక్క సరి చేయాలని ప్రయత్నం చేస్తున్నాడట.ప్రస్తుతం ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ దృశ్యా బోయపాటి శ్రీను లాంటి సరైన మాస్ డైరెక్టర్ తో సినిమా పడితే ఆ లెక్క మరోలా ఉంటుందని విశ్లేషకులు కూడా చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మీ అభిమాన హీరో లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నాత్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ప్రెస్ చేయండి.ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి.👉

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here