Home Box Office చస్….2 రోజుల్లో మెగా ఊచకోత!!…

చస్….2 రోజుల్లో మెగా ఊచకోత!!…

290
0

https://myshopprime.com/sandeep2296/shop

సరిగ్గా రెండేళ్ల క్రితం మెగా స్టార్ పుట్టిన రోజు సందర్భంగా ‘సైరా’ టైటిల్ ని అనౌన్స్ చేస్తూ థమన్ నేపథ్య సంగీతంతో మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. గతేడాది మెగా స్టార్ జన్మదినం రోజు కొన్ని సన్నివేశాలతో ఓ టీజర్ వదిలారు. ఆ టీజర్ అందరినీ ఎట్రాక్ట్ చేసి అంచనాలు పెంచేసింది.

రెండేళ్లుగా చిరు పుట్టినరోజు కానుకగా టీజర్స్ వదులుతూ వస్తున్న మేకర్స్ ఈసారి రోమాలు నిక్కపొడిచే సన్నివేశాలతో మరో టీజర్ రెడీ చేసారు. ఇటీవలే టీమ్ కష్టాన్ని చూపిస్తూ ఓ మేకింగ్ వీడియో కూడా విడుదల చేసారు.మోస్ట్ ఎవైటింగ్ ‘సైరా’ టీజర్ రెడీ అయింది.

https://amzn.to/32Xph2V

ఆగస్ట్ 20 న మెగా స్టార్ పుట్టిన రోజును పురస్కరించుకొని మరో రెండు రోజుల్లో విడుదల చేయబోతున్నారు. ఓ ఈవెంట్ ఏర్పాటు చేసి మరీ గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ టీజర్ కి వాయిస్ ఓవర్ అందించడంతో టీజర్ పై అంచనాలు పెరిగాయి.

స్వాతంత్ర యుద్ధ వీరుడు సైరా నర్సింహ రెడ్డి గురించి పవన్ వాయిస్ ఓవర్ తో టీజర్ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసేలా ఉంటుందట.గతేడాది రిలీజ్ చేసిన టీజర్ లో ‘ఈ యుద్ధం ఎవరిది’ అని ఒకే ఒక్క డైలాగ్ మాత్రం ఉంది. కానీ ఇప్పుడు రిలీజ్ చేసే టీజర్ లో చాలా ఎట్రాక్షన్స్ ఉంటాయని తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here